BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

375 వినూత్న నమూనాలతో సిద్దార్థ అకాడమీలో ఇన్నోవేషన్‌ డే వేడుకలు

Select Suryaa Now
375 వినూత్న నమూనాలతో సిద్దార్థ అకాడమీలో ఇన్నోవేషన్‌ డే వేడుకలు

కానూరు, మేజర్ న్యూస్: భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని విజయవాడ కానూరులోని సిద్దార్థ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో సంస్థాగత ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ సహకారంతో గురువారం ఇన్నోవేషన్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీపుల్‌ అగ్రి వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీతారాం రావి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వినూత్నమైన, సుస్థిరమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఐఐసీ కన్వీనర్‌, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ పీవీఆర్‌ఎల్‌ నరసింహం మాట్లాడుతూ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పరిశోధన, ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం. రవిచంద్‌ విద్యార్థులు తమ ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మలచుకోవాలని ప్రోత్సహించారు. ప్రో వైస్‌ ఛాన్సలర్‌, ఐఐసీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఏవీ రత్న ప్రసాద్‌ ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి, అనుభవాధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించడంలో విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇన్నోవేషన్‌ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా 50 కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 375 వినూత్న నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు తమ సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలను సమాజానికి ఉపయోగపడే విధంగా ఆచరణలోకి తీసుకురావడం, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెసర్‌ బి. పాండురంగారావు, డైరెక్టర్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా దేశ ప్రగతికి దోహదపడేలా విద్యార్థులను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పినట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.