BREAKING
అబ్దుల్‌ కలాంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు ఏపీకి న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ధ్వజం విఎంసీ పోలింగ్ తేదీ మార్పు.. అక్టోబర్ 28కి బదులు 29న పోలింగ్ 6 నెలలు బకాయిల కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలి.వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి

బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మెట్టు సంజయ్ కుమార్ యాదవ్

Select Suryaa Now
బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మెట్టు సంజయ్ కుమార్ యాదవ్

కీసర, మేజర్ న్యూస్: కీసర మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు మెట్టు సంజయ్ కుమార్ యాదవ్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఆదర్శమని పేర్కొన్న సంజయ్ కుమార్ యాదవ్, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగుతానని అన్నారు. మేడ్చల్ రూరల్ జిల్లాలో యువ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.తనను గుర్తించి ప్రోత్సహించి ఈ బాధ్యతను అప్పగించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పటేల్, కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి పట్లోళ్ల విక్రం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, తిరుమల రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు అమరం మోహన్ రెడ్డి, తిరువెంగల లక్ష్మీ, గోనె శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్, మండల అధ్యక్షుడు కోల బాలరాజు యాదవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే జిల్లా నాయకులు గణపురం శ్యాం సుందర్ శర్మ, బోడ శ్రీనివాస్, దేశం మల్లేష్ గౌడ్, మెట్టు కృష్ణ యాదవ్, కొలిచేలిమి కృష్ణ, చినింగని సుధాకర్, నల్ల వెంకట్ రెడ్డి, అబ్రబోయిన నాగరాజుతో పాటు కీసర మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.యువతకు పార్టీ పరంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, వారి సహకారంతో మేడ్చల్ రూరల్ జిల్లాలో బీజేవైఎంను పటిష్టం చేయడమే తన ప్రధాన లక్ష్యమని మెట్టు సంజయ్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.