BREAKING
సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు లాభాల్లో వాటా ప్రకటించాలి. • నల్లగంతలతో విశ్రాంత ఉద్యోగుల నిరసన కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు సంతాప సభ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అబ్దుల్‌ కలాంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు ఏపీకి న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ధ్వజం విఎంసీ పోలింగ్ తేదీ మార్పు.. అక్టోబర్ 28కి బదులు 29న పోలింగ్ 6 నెలలు బకాయిల కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలి.వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
2. సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.:
కలెక్టరేట్ లో  సమావేశ మందిరంలో విద్యాశాఖపై గురువారం  నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల క్రమం తప్పని హాజరుతోనే ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, అవగాహన సామర్థ్యాలను పెంపొందించేలా బోధన కొనసాగించాలని సూచించారు. తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా సిలబస్‌ను పూర్తి చేసి, ప్రతి సబ్జెక్టును విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా బోధించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజూ నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్ రూపకల్పనపై ప్రధానోపాధ్యాయుడికి అభినందన.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రధానోపాధ్యాయుడు మునిందర్ రాజును జిల్లా కలెక్టర్ అభినందించారు.గణితం తదితర సబ్జెక్టులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలు, మెళకువలు, అభ్యాస విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవతో వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఇలాంటి వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత కార్యక్రమాలను మరింత మంది ఉపాధ్యాయులు చేపట్టాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.