telanagana
ఈ నెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ
సూర్య, ఆదిలాబాద్; ఇంద్రవెల్లిలో ఈ నెల 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యేరాథోడ్ బాపూరావు పిలుపునిచ్చారు. సభ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులతో కలిసి సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, సభ ఇన్చార్జి మేక లలిత యాదవ్, విక్రాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వేణుగోపాల్ యాదవ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.