BREAKING
గీతంలో దసరా సంబరాలు... *సరస్వతి పూజ, బొమ్మల కొలువు, దాండియా సందడి* భారతదేశానికి పోషకాహర భద్రత అవసరం సూర్యా కథనానికి స్పందన.. పారిశుద్ధ్య పనులు షురూ! ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కల తొలగింపు.. వాటర్ ట్యాంకర్‌కు మరమ్మతులు ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శశికుమార్‌ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం తండ్రికి తగ్గ తనయుడు.. విధ్వంసకర శతకంతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ శ్రీ వీరభద్రేశ్వర ఆలయం హుండీ లెక్కింపు 6,62,890 వైఎస్సార్‌సీపీలోకి చేరికలు ప్రశాంత ఎన్నికలే లక్ష్యం... వైకాపా గెలుపు పై వైయస్ ప్రమీల ధీమా... వైయస్ అవినాష్ రెడ్డి వైయస్ మనోహర్ రెడ్డి చవ్వా దుస్వంత్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంపై స్మృతి మంధాన ప్రశంసలు.. టీమిండియా భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు *ఘనంగా PP9 ఛానెల్ 5వ వార్షికోత్సవం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.... ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నూనెగింజల సాగుతో అధిక ఆదాయం... గిరిజన రైతులకు అవగాహన కార్యక్రమం పలమనేరు మున్సిపల్ ఎన్నికలు: తొలిరోజు 3 నామినేషన్లు

కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Select Suryaa Now
కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలపాలని కలలుగన్న మహనీయుడు, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ప్రజ్ఞాశాలి, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం అని  ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం పర్చూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సాధారణ కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌ కలాం అసాధారణ ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఏలూరి పేర్కొన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, దేశం పట్ల అంకితభావం ఉంటే సామాన్యులు సైతం అసాధారణ విజయాలను సాధించగలరని కలాం జీవితం నిరూపించిందన్నారు.
విజ్ఞానమే దేశ ప్రగతికి పునాది
భారత అంతరిక్ష, క్షిపణి రంగాల అభివృద్ధిలో కలాం చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. శాస్త్రవేత్తగా దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. రాష్ట్రపతిగా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు మరింత చేరువయ్యారని గుర్తుచేశారు. పదవులు అలంకారప్రాయాలు కావని, ప్రజలకు సేవ చేయడానికి వాటిని వినియోగించాలనే సందేశాన్ని తన జీవితం ద్వారా చాటిచెప్పారని కొనియాడారు.
యువతే నవభారత నిర్మాణ శక్తి
యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని లక్ష్యసాధన దిశగా నడిపించడమే కలాంకు నిజమైన నివాళి అని ఏలూరి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వైఫల్యాలకు కుంగిపోకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, వ్యవసాయం, విద్య, పరిశోధన వంటి రంగాల్లో యువత నూతన ఆవిష్కరణలతో దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం కలలు కనాలి.. సమాజం కోసం పనిచేయాలి
వ్యక్తిగత విజయంతో పాటు సమాజానికి ఉపయోగపడే లక్ష్యాలను నిర్దేశించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలను అధిగమించి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న కలాం ఆకాంక్షలను సాకారం చేయడానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలన్నారు.
నిరాడంబరత, నిబద్ధత, దేశభక్తి, మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచిన అబ్దుల్‌ కలాం జీవితం తరతరాలకు మార్గదర్శకమని పేర్కొంటూ.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే జయంతి సందర్భంగా మనం సమర్పించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే ఏలూరి సందేశమిచ్చారు.
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.