సూర్యా కథనానికి స్పందన.. పారిశుద్ధ్య పనులు షురూ! ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కల తొలగింపు.. వాటర్ ట్యాంకర్‌కు మరమ్మతులు
కొండాపూర్; ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన సూర్యా దినపత్రిక కథనానికి గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. గురువారం “గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం” అనే శీర్షికతో సూర్యా ఆన్‌లైన్‌తో పాటు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు.గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో తొలగించారు. మరమ్మతులకు గురైన గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌కు మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు.సమస్యలను వెలుగులోకి తెస్తున్న సూర్యా గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ సూర్యా దినపత్రిక ప్రజల పక్షాన నిలుస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వార్త ప్రచురితమైన వెంటనే అధికారులు స్పందించి పనులు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికలు పోషించే పాత్రకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.