BREAKING
ప్రస్తుతం ఉన్న చౌక్ యధావిధిగా సాగుతుంది పరమపదనాథ అలంకరణలో శ్రీవారు యూరోపియన్ యూనియన్ బడ్జెట్‌పై జర్మనీ పట్టు పలమనేరు అధ్యాపకుడికి పీహెచ్‌డీ దొడ్డోజి కుటుంబానికి ఆర్థిక ఆసరా. దాక్షారము వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాకిస్తాన్‌లో పాఠశాల పైకప్పు కూలి విద్యార్థుల మృతి ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ఎన్నికల ఏర్పాట్లకు పరిశీలించిన అధికారులు అమెరికా చెల్లింపులు మరియు డీజిల్ ఒప్పందాలపై కలిసి పనిచేసేందుకు సంసిద్ధత కేసుల దర్యాప్తులో అలసత్వం వహించవద్దు మహేశ్వరం ఏసిపి జానకి రెడ్డి శంకర్పల్లి లో బతుకమ్మ సంబరాలు బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి మెక్సికోలోని గ్వాడలజారా నగరంలో చెలరేగిన ప్రజా నిరసనలు

డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు

Select Suryaa Now
డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు
సూర్య కరీంనగర్ ;డంపు యార్డు వల్ల ఒకవైపు ప్రజలు ప్రతిరోజూ ఇబ్బంది పడుతుంటే సమస్యను ఇంకొకరిపై ఒకరు నెట్టివేసుకొని రాజకీయ లబ్ధికోసం ప్రాకులాడడమేంటని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.స్థానిక సుడా మాజీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయో మైనింగ్ చేయడంలో ఇప్పటివరకు ఒక అడుగు ముందుకు వేసి రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారని ఒక్క మిషన్ తో రోజుకు 5 వందల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బయోమైనింగ్ చేయలేమని అక్కడ దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకు పోయి ఉందని ప్రతి రోజు చేసినా 3 సంవత్సరాలు పడుతుందని అదీకాక మళ్లీ ప్రతిరోజూ ఫ్రెష్ వెస్ట్ 2 వందల మెట్రిక్ టన్నులు జమ అవుతనే ఉంటదని నరేందర్ రెడ్డి అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ప్రతిరోజు 2 వేల మెట్రిక్ టన్నులు బయోమైనింగ్ చేయగలిగితే ఒక సంవత్సరంలో ఉన్న చెత్త మొత్తం క్లియర్ చేయగలుగుతామని దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం కలిసికట్టుగా కృషి చేస్తేనే అది సాధ్యం అవుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.యూసీఎఫ్ నిధులు సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయించుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మంచి అవకాశం ఉండే అని ఆనాడు బీఆర్ఎస్ లో చిత్తశుద్ధి ప్రదర్శించని వారికి బీజేపీ ఈనాటి పాలకవర్గంలో మరియు పార్టీలో కీలక పదవిచ్చి బ్యాక్ ఫ్రంట్ పెట్టుకుని ఇతరులను నిందించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సేకరించడంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయని మానిటరింగ్ సరిగా చేస్తే ఫ్రెష్ వెస్ట్ ను తగ్గించవచ్చని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ప్రస్తుతానికి పొగ బారినుండి ఉపశమనం పొందేందుకు నాలుగు వైపులా బోర్లు వేసి స్పింక్లర్స్ ఏర్పాటు చేస్తే సత్వరం పరిష్కారం దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారని ఆదిశగా ప్రయత్నం చేయాలని నరేందర్ రెడ్డి కోరారు.నాయకులు క్రెడిట్ కోసం ప్రాకులాడడం మాని చిత్తశుద్ధి తో ముందుకు సాగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నరేందర్ రెడ్డి అన్నారు.వాస్తవాలు మాట్లాడుతే కొందరు నువ్వేమయ్యావని నాపై ఎదురుదాడి చేపిస్తున్నారని 35 సంవత్సరాలుగా నిబద్ధతతో ఒకే పార్టీలో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నన్ను ప్రజలు కోరుకున్న రోజు ఆపడం ఎవరితరం కాదని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో  
మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి తాజ్,కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నర్సింగం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,మామిడి సత్యనారాయణ రెడ్డి,ఎండి చాంద్,దండి రవీందర్,గుడిపాటి రమణా రెడ్డి,బషీర్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.