andhrapradesh
పలమనేరు అధ్యాపకుడికి పీహెచ్డీ
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకుడు కొల్లేటి వెంకటాద్రి జేఎన్టీయూ అనంతపురం నుంచి పీహెచ్డీ పట్టా సాధించారు. డాక్టర్ డి. జరీనా పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటేశులు, అధ్యాపక బృందం ఆయనను అభినందించారు.