పోషణ మేళాలో ప్రథమ బహుమతి సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల
తూప్రాన్;జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మేళాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, తూప్రాన్ ప్రథమ స్థానాన్ని సాధించింది. పోషకాహారం ప్రాముఖ్యత, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై కళాశాల ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రభావతి ప్రథమ బహుమతిని అందుకున్నారు.ఈ ఘనత సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కళాశాల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడానికి పోషణ మేళా ఎంతగానో దోహదపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భార్గవి, డి ఆర్ డి ఓ పిడి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జ్ఞానేశ్వర్, అడిషనల్ డి ఆర్ డి ఓ సరస్వతి, తదితరులు పాల్గొన్నారు