దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 17 వ వార్డు పరిధిలో గల దీనదయళపురం గ్రామలో వెలసియున్న శ్రీ విజయదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములు గౌతమి గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం షష్ఠి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఏర్పాటు చేసిన కుంకుమ పూజలులో భక్తులు పూజ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు . సాయంత్రం ఆలయంలో లక్ష్మి గణపతి, కాత్యాయనీ హోమం, విజయదశమి దసరా వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామ అధ్యక్షులు యల్లమిల్లి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘ కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, ఉపాధ్యక్షులు అప్పారి శ్రీరామ్ కుమార్, మరిడిశెట్టి, సూర్య ప్రభాకరావు,అనిల్, ఇల్లీపిళ్లి శ్రీనివాసరావు, నల్లజర్ల నాగేశ్వరావు, భద్రి, సత్తార్, ఈశ్వరమ్మ, నాని, భక్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, ఆరిలోవ, విశాఖపట్నం.