నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.... ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
పలాస /ఇచ్చాపురం, సూర్య : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు.శుక్రవారం ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు,బెదిరింపులు,ఓటర్ల ప్రలోభాలు,చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు భయాందోళన లేకుండా ఎన్నికల్లో పాల్గొనాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే పోలీసులకు తెలపాలని కోరారు.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు,రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేయవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.