BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- హాజరైన ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్  రజాక్

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్) - సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఏరియా వర్క్ షాప్ ప్రాంగణంలో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. వర్క్ షాప్ డీజీఎం జే. క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం ఎదుట నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిస్ లు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ఈ వేడుకలకు ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్ పాల్గొన్నారు. అదేవిధంగా  ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జక్కుల గట్టయ్య, ఇంజనీర్లు బి. శంకర్, టి. అనిల్, ఏ. ఉపేందర్ బాబు, పిట్ కార్యదర్శులు ఎండి. సత్తార్ పాషా, మధుకృష్ణ తదితర కార్మిక సంఘ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను కార్మికులంతా ఐక్యంగా జరుపుకోవడం సంతోషకరమని, పండుగలు పని ఒత్తిడిని దూరం చేసి నూతనోత్సాహాన్ని నింపుతాయని నాయకులు అన్నారు. అనంతరం బతుకమ్మ ఆడిన మహిళా ఉద్యోగులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ తో పాటు 10 కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జాన్ కెనెడీ, బ్రాంచ్ కార్యదర్శి మెంగని అశోక్ తో పాటు పలువురు సూపర్వైజర్లు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, అప్రెంటిస్ లు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.