ప్రశాంత ఎన్నికలే లక్ష్యం... వైకాపా గెలుపు పై వైయస్ ప్రమీల ధీమా... వైయస్ అవినాష్ రెడ్డి వైయస్ మనోహర్ రెడ్డి చవ్వా దుస్వంత్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల గురువారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి చావ్వా దుష్యంత్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డితో కలిసి ఆమె నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.నామినేషన్ అనంతరం వైఎస్ ప్రమీల మీడియాతో మాట్లాడుతూ, పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండటం సంతోషకరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ఈ నెల 28న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని వైఎస్ ప్రమీల కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.పులివెందుల మున్సిపాలిటీలో తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధుసూదన్‌రెడ్డి సతీమణి మాధవిరెడ్డితో పాటు పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా