BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

గీతంలో దసరా సంబరాలు... *సరస్వతి పూజ, బొమ్మల కొలువు, దాండియా సందడి*

Select Suryaa Now
గీతంలో దసరా సంబరాలు... *సరస్వతి పూజ, బొమ్మల కొలువు, దాండియా సందడి*

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : దసరా నవరాత్రుల సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని  వివిధ విభాగాలలో దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్ధులు దాండియా ఆట పాటలతో విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని ఉత్సాహంగా మారుస్తూ సందడి చేయగా గీతం  అడ్మిషన్ విభాగం బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో  శుక్రవారం   సరస్వతి పూజను నిర్వహించారు. దసరా బొమ్మలు కొలువు, రంగోలిలతో ఉద్యోగులు పండగ శోభను తీసుకువచ్చారు. మరోపక్క గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆవరణలో సరస్వతి పూజను విద్యార్ధులు, అధ్యాపకులు వైభవంగా నిర్వహించారు. అదే విధంగా పుస్తకాలకు నెలవైన విశ్వవిద్యాలయం గ్రంధాలయం (నాలెడ్జి రీసోర్స్ సెంటర్)లో గ్రంధాలకు సరస్వతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వీటితో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజి తదితర విభాగాలలో సహితం పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గీతం వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలోని  శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో సరస్వతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.