BREAKING
ఏపీకి న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ధ్వజం విఎంసీ పోలింగ్ తేదీ మార్పు.. అక్టోబర్ 28కి బదులు 29న పోలింగ్ 6 నెలలు బకాయిల కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలి.వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

పోలంపల్లి ఎంపీటీసీ బరిలో దారెల్లి రాణి? రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఊపందుకున్న రాజకీయ చర్చలు

Select Suryaa Now
పోలంపల్లి ఎంపీటీసీ బరిలో దారెల్లి రాణి?  రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఊపందుకున్న రాజకీయ చర్చలు

వత్సవాయి: మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఎంపీటీసీ పదవికి సంబంధించి రాజకీయ చర్చలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా రాజకీయ పార్టీల్లో ఆశావహుల పేర్లపై చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలంపల్లి గ్రామానికి చెందిన దారెల్లి చిరంజీవి సతీమణి రాణి పేరు ఎంపీటీసీ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.మండల స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దారెల్లి చిరంజీవి.. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతూ వస్తున్నట్లు సమాచారం. రాజకీయ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.ముఖ్యంగా పోలంపల్లి గ్రామ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించడంతో పాటు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, అవసరమైన సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకోవడం ద్వారా గ్రామంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామస్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలోనూ దారెల్లి చిరంజీవి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ, కార్యకర్తలు మరియు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడిగా చిరంజీవికి గుర్తింపు ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి రాణికి ఎంపీటీసీ అవకాశం కల్పిస్తే పార్టీకి మరింత బలమైన అభ్యర్థి అవుతారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోలంపల్లి ఎంపీటీసీ స్థానంపై పలువురు ఆశావహులు దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఎవరి అభ్యర్థిత్వం ఖరారవుతుంది? పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది? అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.నియోజకవర్గ స్థాయిలో దారెల్లి చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న నేపథ్యంలో ఆయన సతీమణి రాణి పేరు ఎంపీటీసీ అభ్యర్థిగా పరిశీలనలో ఉండటం పోలంపల్లి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే చివరకు పార్టీ నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.ఎంపీటీసీ స్థానానికి రాణి పేరు ఖరారవుతుందా? దారెల్లి చిరంజీవి రాజకీయ ప్రస్థానానికి మరో ముందడుగుగా ఈ అవకాశం మారుతుందా? లేక పోటీలో ఉన్న ఇతర ఆశావహులకు అవకాశం దక్కుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికి మాత్రం పోలంపల్లి ఎంపీటీసీ స్థానంపై దారెల్లి రాణి పేరు చర్చనీయాంశంగా మారింది.