BREAKING
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం …పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీలు. కార్మిక బోర్డు లో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టాలి అసలు ఎవరు ఈ గరివిడి లక్ష్మి.. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా విశేషాలు

డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ జీవితం ఆదర్శనీయం. :

Select Suryaa Now
డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ జీవితం ఆదర్శనీయం. :
సూర్య నిర్మల్ ప్రతినిధి.:నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఈద్ గామ్ చౌరస్తా వద్ద డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ 95 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ స్వర్గీయ ఏ పి జె అబ్దుల్ కలామ్ భారత దేశానికి నిస్వార్థ సేవ చేసారని ఏ.పీ.జే అబ్దుల్ కలామ్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసారు. విద్యార్థుల పట్ల వారు చూపిన ఆసక్తితో ఈ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఏపీజే అబ్దుల్ కలామ్ నిస్వార్థ  సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఏ.పీ.జే అబ్దుల్ కలామ్ జయంతి, వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, నిర్మల్ మున్సిపాలిటీ ద్వారా ఈద్ గామ్ చౌరస్తా వద్ద ఏ పి జె అబ్దుల్ కలామ్, కాంస్య విగ్రహంతో పాటు వారు కనిపెట్టిన మిస్సయిల్ నమూనాను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఇంతియాజ్ అహ్మద్  మాట్లాడుతూ ఏ పి జె అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చారన్నారు. భారత దేశాన్ని అణు శక్తి రంగంలో ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా కృషి చేసిన  గొప్ప మహనీయుడని కొనియాడారు.  ఈ జయంతి వేడుకల్లో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అజహరుద్దీన్,  సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ జావీద్, షేఖ్ ఖలీల్, అబ్దుల్ వాజీద్, మిర్జా షోయెబ్, కరీమ్,  మొహమ్మద్ మిన్హాజ్, శేఖర్, మహేందర్, మొహమ్మద్ షాదాబ్ కలామ్ గుణం యూత్, వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్, షాదాబ్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ ఇంతియాజ్, రిజ్వాన్ ఖాన్ యువత తదితరులు పాల్గొన్నారు.