BREAKING
డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు సంతాప సభ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అబ్దుల్‌ కలాంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు ఏపీకి న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ధ్వజం విఎంసీ పోలింగ్ తేదీ మార్పు.. అక్టోబర్ 28కి బదులు 29న పోలింగ్ 6 నెలలు బకాయిల కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలి.వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు

నేడు వైద్య ధృవీకరణకు చివరి అవకాశం -ఉదయం 9 గంటలకు రుయా ఆసుపత్రికి హాజరుకావాలి : డీఈఓ

Select Suryaa Now
నేడు వైద్య ధృవీకరణకు చివరి అవకాశం -ఉదయం 9 గంటలకు రుయా ఆసుపత్రికి హాజరుకావాలి : డీఈఓ

ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్ల కోసం వైద్య ధృవీకరణ పూర్తి చేసుకోని అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి శుక్రవారం చివరి అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు.పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నూతన జిల్లాల పునర్విభజన ఉత్తర్వులు-2026 ప్రకారం సంబంధిత సిబ్బంది  ఉదయం 9.00 గంటలకే తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే పలువురు పరీక్షలు పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రాలు పొందారని, తిరుపతి, పుత్తూరు, చిత్తూరు, మదనపల్లి, రాయచోటి, రైల్వే కోడూరు డివిజన్లు, చిత్తూరు నుంచి తిరుపతిలో కలిసిన 5 మండలాలు, నెల్లూరు నుంచి తిరుపతిలో కలిసిన 11 మండలాల పరిధిలో ఇప్పటివరకు వైద్య ధృవీకరణ పత్రాలు పొందని వారు హాజరు కావాలన్నారు. క్యాన్సర్, ప్రధాన నాడీ శస్త్రచికిత్స, మూత్రపిండ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు సంబంధించిన కేటగిరీలలో అర్హత కలిగిన వారు తమకు సంబంధించిన వైద్య నివేదికలు, ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు వైద్య ధృవీకరణ పూర్తి చేసుకోని వారు శుక్రవారం నిర్వహించే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్