ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంఘీభావం
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగులకు సంఘీభావం తెలిపి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య సేవల్లో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు. అర్హులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనాల పెంపు, ఇతర సర్వీసు ప్రయోజనాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి, వారు తిరిగి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, హైమావతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గౌస్ పాషా, కల్పన, సమన్వయ కర్త ప్రవీణ్, భీముడు రామకృష్ణరెడ్డి, డాక్టర్ రాజు, డాక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్ నాగర్కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: