*నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు* *సదాశివపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు* *అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే*
సదాశివపేట;దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. సదాశివపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిజాంపురం కుటుంబ సభ్యులు అశోక్, రవి, నాగరాజు ఆధ్వర్యంలో, జైభవీ యూత్ మాజీ కౌన్సిలర్ ఆకుల శివ, దిద్దిగే నగేష్, కటకం కిరణ్, మల్లికార్జున, వంశీ, సాయిరాజు సేటు, ధనుంజయ్ గౌడ్, రచ్చన్న స్వామి, సారపు అభి, చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, శ్రీధర్ రెడ్డి, చింత సాయినాథ్, చీల మల్లన్న, నగేష్, కౌన్సిలర్ వైశాలి నాగరాజు గౌడ్, దిద్దిగే వినోద్, కొట్రికే సాయిరాజ్, తంగెడ్పల్లి లక్ష్మణ్, కంది మల్లేశం, పెద్ద గౌడ్, మల్లికార్జున శంకర్, కొత్త రామన్న, కోడూరు అంజయ్య తదితర స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.