బంగారు మైసమ్మకు బండ్లు,బోనాలు
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కొల్లూరు గ్రామ పరిధిలోని సత్రోనిపల్లి తాండలో కొలువుదీరిన బంగారు మైసమ్మ అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎడ్లబండ్లు,బోనాల ఉత్సవం నిర్వహించారు.మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా తాండలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సేవ్య నాయక్,ఉప సర్పంచ్ సునీత జగన్,ఏఎంసి వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్ నాయక్, గ్రామ పెద్దలు సుధీర్ రెడ్డి,కృష్ణయ్య గౌడ్,రఘు గుప్తా,రాజు,కృష్ణారెడ్డి,ఖాజా మైనోద్దీన్,మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్,కంకంటి కృష్ణయ్య,గోపాల్ గౌడ్,బంటు లక్ష్మయ్య,నరేష్,డప్పుబాలకిష్టయ్య ఎల్లయ్య,కృష్ణ గౌడ్, రత్నాబాబు నాయక్,తారా సింగ్ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.