*గవర్నర్ కోటాలో నీలం మధుకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి* *- జిన్నారం మండల ఎన్ఎంఆర్ యువసేన నాయకుడు గణేష్ డిమాండ్*
జిన్నారం; బీసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు నీలం మధు ముదిరాజ్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మంగంపేట మాజీ వార్డు సభ్యుడు, ఎన్ఎంఆర్ యువసేన నాయకుడు గణేష్ డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు. శుక్రవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా నీలం మధు ముదిరాజ్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ వర్గాల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం బహుజన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేస్తున్న నీలం మధుకే గవర్నర్ కోటా ద్వారా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.