మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
*మిర్యాలగూడ, మేజర్ న్యూస్:*
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మపండుగను పురస్కరించుకునిమిర్యాలగూడ కోర్టు ప్రాంగణం, తోపాటు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో న్యాయమూర్తులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది,ఇతరమహిళామణులు పాల్గొనిరంగురంగుల ప్రకృతి పుష్పాలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా ఆడి పాడారు.ఈ సందర్భంగా 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.వి. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధించడం తెలంగాణకే ప్రత్యేక విశిష్టత అన్నారు. బతుకమ్మ ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటి చెబుతుందన్నారు.
ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్యరాణి మాట్లాడుతూ బతుకమ్మ మహిళలకు ప్రత్యేక పండుగని, తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకృతిని ప్రజల జీవన విధానంతో మమేకం చేసే విశిష్ట పండుగ బతుకమ్మ అన్నారు. సీనియర్ న్యాయవాదులు నేతి సత్యనారాయణ, తడకమళ్ల రామరంగారావు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకఅన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇసరం కరుణాకర్, ప్రధాన కార్యదర్శి జంగిలి ఎల్లయ్య, సంయుక్త కార్యదర్శి రాయారపు భాస్కర్, కోశాధికారి రెడ్డిపల్లి సైదులు, మహిళా ప్రతినిధి బి. జ్యోతి, బొంగర్ల నాగరాజు, ఏపీపీ భవాని తదితరులు పాల్గొన్నారు.
*మున్సిపాలిటీఆవరణలలో*
మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ చిలుకూరు . సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి . శిరీష నవీన్, కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ కళ్యాణి, మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది భారీ బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలపై ఆడి పండుగ వాతావరణాన్ని నింపారు.