ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..
పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి
నల్లగొండ టౌన్ ,మేజర్ న్యూస్:
ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎన్.హెచ్.ఎం అన్ని క్యాడర్ల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 4 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు శుక్రవారం రోజున ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు .పెండింగ్ ఇంక్రిమెంట్లు, బోనస్, పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగా భద్రత, ఇన్సూరెన్స్, EHS/ESI సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల హక్కుల సాధన పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతూ ఉంటుందని దేవేందర్ రెడ్డి తెలిపారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఎస్ రెడ్డి సహాయ కార్యదర్శి ఎండి జానీ, ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా నాయకులు డాక్టర్ హరిప్రియ, దయానంద్, సైదయ్య, సురేష్, ఉపేందర్ గణేష్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.