కొల్చారంలో ‘సహన’ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కోల్చారం;కార్పేడ్ స్వచ్ఛంద సంస్థ సలహాలతో నడుస్తున్న ‘సహన’ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్చారం మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఉయ్యాల పాటల ద్వారా పెద్దలందరికీ అవగాహన కల్పిస్తూ బతుకమ్మ ఆటలను ఆడించారు.గత రెండు సంవత్సరాలుగా సహన సంస్థ బాలల హక్కుల పరిరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు ( కల్చరల్ యాక్టివిటీస్), ఆరోగ్య రక్షణ, అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు, పిల్లలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు కొల్చారం గ్రామంలో ఈ ప్రత్యేక బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహన సంస్థ ప్రతినిధి సత్యనారాయణ, వాలంటీర్ నరేష్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళలు మరియు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు