టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం
టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం
ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్
దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు నగరం బివి రెడ్డి కాలనీ లోని టీవీ -7 మీడియా కార్యాలయం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం అమానుషమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇంచార్జ్ కవరకుంట్ల జయరాజ్ ఖండించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వాపోయారు. ముసుగులు ధరించి నిర్దాక్షిణ్యంగా జరిపిన దాడిలో టీవీ 7 కార్యాలయం పూర్తిగా ధ్వంసమవగా, టీవీ - 7 ఎడిటర్ శ్రీనివాసమూర్తి, మరో ప్రతినిధి, చిత్తూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణకు తీవ్ర గాయాలు కావడం దురదృష్టకరమన్నారు. ఈ దాడి సంఘటనలు టీవీ - 7 కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీలో స్పష్టంగా వెలుగు చూశాయని, వాటి ఆధారంగా పోలీసులు వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. జర్నలిస్టులకు, పత్రికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు, బాలసుబ్రమణ్యం, కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు ఉమాశంకర్, తులసి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఉదయ్, విజయ్ కుమార్, ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు దాము, టీవీ - 7 మేనేజింగ్ డైరెక్టర్ గుడివాడ మోహన్, టీవీ - 7 ఎడిటర్ శ్రీనివాసమూర్తి, ఇన్ పుట్ ఎడిటర్ మురళీకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజుతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.