దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్కు భూమిపూజ
రేణిగుంట మేజర్ న్యూస్: రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగువమాఘంలో రూ.3 కోట్లతో నిర్మించనున్న రాజన్న హెల్త్ సెంటర్కు ఫౌండేషన్ చైర్మన్, అమర్ రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. గల్లా రామచంద్ర నాయుడు గురువారం భూమిపూజ చేశారు.ఈ ఉచిత ప్రాథమిక వైద్యం, క్లినికల్ ల్యాబ్, ఫిజియోథెరపీ సేవలు అందించనున్నారు. నెలకు రెండుసార్లు అమరా హాస్పిటల్ నిపుణులైన వైద్యులు సేవలందిస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, మాజీ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమేష్ బాబు కొండల