సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత
--సిపిఐ(ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత
---కన్నీరు మిగిల్చిన తనయుడి మరణం
--తండ్రికి ఇష్టమైన బట్టలు కొనిచ్చి… క్షణాల్లోనే కానరాని లోకాలకు
వైరా సూర్య మేజర్ న్యూస్ :---
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రయోజకుడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెక్కల కష్టంతో పెంచిన బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. తండ్రికి ఇష్టమైన బట్టలు కొనిచ్చి ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆ కుమారుడు విగతజీవిగా మారడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు గండగలపాడుకు చెందిన సీపీఐ(ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు కిన్నెర రాఘవ (19) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవ రెండు రోజుల క్రితమే స్వగ్రామమైన గండగలపాడుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం తన తండ్రికి ఇష్టమైన బట్టలు కొనిచ్చి ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే వైరాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, అప్పటికే రాఘవ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లముందే తిరుగుతూ కబుర్లు చెప్పిన కొడుకు ఇక లేడనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కుమారుడి మరణవార్తతో తండ్రి కిన్నెర కృష్ణ, తల్లి విజయల రోదనలు మిన్నంటాయి. ఉన్నత చదువులు చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆశించిన కుమారుడు 19 ఏళ్లకే తనువు చాలించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బిడ్డతో కలిసి చూడాలనుకున్న భవిష్యత్తు కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన పలువురిని కలచివేసింది.
ఈ విషాద ఘటనతో గండగలపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సిపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ, బొంతు రాంబాబు, వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్ కృష్ణ నివాసానికి చేరుకుని కిన్నెర రాఘవ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు• కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితోపాటు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, ముళ్ళపాటి సీతారాములు టిడిపి వైరా డివిజన్ నాయకులు చెరుకురి చలపతిరావు, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, కౌన్సిలర్లు
చింతనిప్పు సులోచన, కట్టా స్వరూపరాణి, ఫనితి సైదులు మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, డాక్టర్ ఉండ్రు శ్యాంబాబు, టిడిపి మండల నాయకులు కిలారు సురేందర్, బొల్లెపల్లి శ్రీనివాసరావు, మందడపు మధుసూదన్ రావు, సిపిఐ(ఎం) కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, వైరా పట్టణ నాయకులు చింతనిప్పు చలపతిరావు, మచ్చా మణి, మల్లెంపాటి రామారావు, కొంగర సుధాకర్, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, రాచబంటి భత్తిరన్న, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, బొంతు సమత, సంక్రాంతి నరసయ్య, కామినేని రవి, గమ్మా నరసింహారావు, ఇమ్మడి సుధీర్, అనుమోలు రామారావు, షేక్ నాగల్ పాషా, సంక్రాంతి పురుషోత్తం, కంసాని మల్లికాంబ, మాడపాటి మల్లికార్జునరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు•