BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

పేదల ఇంట పండుగ వాతావరణం వెల్జాల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
పేదల ఇంట పండుగ వాతావరణం వెల్జాల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

 

*ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ వాన రాశి రాములమ్మ*

*ఏళ్ల కల నెరవేరడంతో లబ్ధిదారుల హర్షాతిరేకలు*

తలకొండపల్లి, రంగారెడ్డి : మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో నూతన రేషన్ (స్మార్ట్) కార్డుల పంపిణీతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పేద కుటుంబాలకు గ్రామ సర్పంచ్ వానరాశి రాములమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, సి ఎల్ శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ శివ విజయలక్ష్మి విజయ్ కుమార్, సంయుక్తంగా నూతన స్మార్ట్ కార్డులను అందజేశారు. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది పేద కుటుంబాల నిరీక్షణ నేటితో ఫలించింది. తమ చేతికి నూతన స్మార్ట్ కార్డులు అందడంతో 1215 మంది లబ్ధిదారుల ముఖాలలో   ఆనందం వెల్లువెత్తింది. ప్రభుత్వం తమ సంక్షేమ ప్రయాణానికి బాటలు వేసిందంటూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.అశోక్ బాబు, అజీజ్, వానరాశి వెంకటేష్, ఏ నరేందర్ గౌడ్, ఆరిఫ్, గట్టు రాఘవేందర్ గౌడ్, అబ్బాస్, పెంటయ్య గౌడ్, ఏ జగదీశ్వర్ రెడ్డి, గడ్డం విజయ్ కుమార్ యాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వాజిద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, ఆశ వర్కర్ లు, బుక్ కిపర్లు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.