అద్దంకిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల నోడల్ అధికారి.
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు పాటించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు లోబడి జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.