BREAKING
జనసేన సిద్ధాంతాలే మా బలం.. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి సిద్ధం! అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.*

ఎన్నికల కమిషన్ల ను రద్దు చేయాలి..... *2023 ఎన్నికల కమీషన్ చట్టాన్ని రద్దు చేయాలి

Select Suryaa Now
ఎన్నికల కమిషన్ల ను రద్దు చేయాలి..... *2023 ఎన్నికల కమీషన్  చట్టాన్ని రద్దు చేయాలి

విజయనగరం, సూర్య : కేంద్ర ప్రభుత్వ విధానాలకు విసిగి చెందిన యువతలో వచ్చిన పెను మార్పే  కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకి కారణమని, కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఉద్యమాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందని ప్రజాస్వామ్య ఐక్యవేదిక వ్యవస్థాపకులు,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను విధుల నుండి తొలగించాలని, 2023 ఎన్నికల కమిషన్ నియామక చట్టాన్ని రద్దుచేసి, నూతన ఎన్నికల కమిషన్ ను ఏర్పాటు చేయాలని,ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికలను రద్దుచేసి మరల ఎన్నికలు నిర్వహించాలని డాక్టర్ బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఓటును నమ్ముకోండి.. అమ్ముకోకండి గోడపత్రికలను శుక్రవారం ఆవిష్కరించారు.అనంతరం డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకొనే ఒక గొప్ప అవకాశాన్నిభారత రాజ్యాంగం కల్పించిందని,అంతటి గొప్ప ఓటు హక్కును నోట్లకు అమ్ముకోకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు నేరమని, ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే ఓటు హక్కును  దుర్వినియోగం చేయకుండా నోటాకు వేయాలని సూచించారు.నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నిక చెల్లదని చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం తీరు వల్ల దేశంలో ఒక అశాంతి వాతావరణ నెలకొందని, దేశం యావత్తు వ్యతిరేకిస్తున్న కేంద్రం మాత్రం జ్ఞానేశ్ కుమార్ వెనకేసుకు వస్తుందని ఆయన మండిపడ్డారు.దేశంలో జరుగుతున్న యువతరం చేస్తున్న ఆందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపు వల్ల కోట్లాదిమంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
1990 నుంచి 1996 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న  టిఎన్ శేషన్ పని తీరును తట్టుకోలేక,1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ   ఒక చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్ నియమించే బాధ్యత ప్రధానమంత్రి, పార్లమెంట్ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండేదని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నియమించే చట్టాన్ని మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజి,జెవివి జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు,గండ్రేటి అప్పలనాయుడు,జెవివి రాష్ట్ర ట్రెజరర్ డాక్టర్ పైల రమేష్ రాజు, రాష్ట్ర నాయకులు గండ్రేటి శ్రీను, జిల్లా ట్రెజర్ ఎస్. శివాజీ,ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు పిడకల ప్రభాకర్,ఏ. సదాశివరావు, సిహెచ్ పైడితల్లి, సప్ప ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.