BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేయటం అమానుషం -బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న సంగారెడ్డి కింది బజార్ చెరువు కట్ట - సదాశివపేట మండలం రేజింతల్‌లో బతుకమ్మ ఘాట్‌ను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి,తోపాజి నెల్లిమర్ల రాజకీయాల్లో ఊహించని పరిణామం.... * చైర్మన్ సీటుపై ధీమా బంగారు మైసమ్మకు బండ్లు,బోనాలు దుర్గామాత మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం మూలా నక్షత్రం వేళ అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు ఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం చల్లా సునీల్ పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు గీతంలో ఘనంగా దండియా ఉత్సవం -‘శుభారంభ్–2026’ పేరిట గర్బా, దండియా నృత్యాలు -సంప్రదాయ వస్త్రధారణలో వేలాది మంది విద్యార్థుల సందడి గెలుపే లక్ష్యంగా పనిచేయండి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్ బట్టు శ్వేతా దంపతులు పండగ పూట పస్తులేనా? కార్మికుల ఆవేదన! లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ సరికొత్త హంగులతో లోహ మార్కెట్లో విస్తరణ వైసిపి నిజమైన గొడ్డలి పార్టీనే... -గొడ్డలి పార్టీ మళ్ళీ రక్తపు రాజకీయం- ప్రజాస్వామ్యంపై దాడి -నామినేషన్ అంటేనే వైసీపీకి భయం-అందుకే కర్ణాటక రౌడీలతో దాడులు మిథున్ రెడ్డి ప్రజలపై వాహనాలతో తొక్కారు- ఇది రాజకీయమా? రౌడీయిజమా? -రాజారెడ్డి రాజ్యం అంతమైంది-ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ యుగం -సై అంటే సై-ఇక ఇక త

ఎన్నికల భద్రతపై ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
ఎన్నికల భద్రతపై ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన

ఎన్నికల భద్రతపై ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ముందుగా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం బనవాసి సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంతో పాటు వెంకటాపురం, ఆది ఆంధ్ర పాఠశాలలను సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కడిమెట్ల, ఎర్రకోట వంటి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ఎమ్మిగనూరు డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేయాలని, పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ చిరంజీవి, టౌన్ సీఐ కంబగిరి రాముడు, టౌన్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ శరత్  కుమార్ 
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి, కర్నూలు జిల్లా