భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు
చీపురుపల్లి, సూర్య : మండలంలోని అమ్మవారి ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. చీపురుపల్లి గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం నందు దేవి శరన్నవరాత్రులలో భాగంగా 6వ రోజు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారికి అలంకరణ చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. విద్యార్థులతో సరస్వతీదేవి పూజ చేయించారు. అలాగే శివరాం రహదారిలో గల శ్రీ లలితదేవి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.