telanagana
ఫామ్ ఫండ్ ఉపాధి హామీ పనులు ప్రారంభం
సూర్య వేల్పూరు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బీవీజీ రామ్ జీ పథకంలో భాగంగా ఫామ్ ఫండ్ కోసం ఈరోజు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తింటి పుప్పాల రాజేందర్, ఉపసర్పంచ్ నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్, గ్రామ కార్యదర్శి కార్తీక్ పాల్గొన్నారు. పనులకు వచ్చిన కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు, వ్యవసాయానికి ఉపయోగపడే పనులను చేపట్టడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.