BREAKING
శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల భారీ వర్షానికి తమిళనాడు చెన్నైలో జలమయమైన రహదారులు చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ *కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ* *భూ సర్వేలో ఖచ్చితత్వం.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం* సరస్వతి దేవి అవతారంలో పోలమాంబ త్రిముఖదుర్గాంబ సన్నిధిలో టిడిపినేత మన్నేపల్లికార్తీక్: ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు దొడ్డి దారిన సర్టిఫికెట్లతో పదవులు దోపిడీ -గౌడ్ కుల దృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేయకండి : గౌడ్ సంఘం నేతలు జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు ది బ్యాట్మన్ పార్ట్ 2 షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మ్యాట్ రీవ్స్.. సహాయం అందించనున్న స్టీవెన్ సోడర్‌బార్క్ భైరవకోనలో గజలక్ష్మిదేవిగా త్రిముఖదుర్గాదేవి: ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై దృష్టి సారించాలి... ఎన్‌సీడీ జిల్లా అధికారి డాక్టర్ జగన్ మోహన్ తహసిల్దార్ కార్యాలయంలో కమనీయ తెలంగాణ సంస్కృతి అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు!

Select Suryaa Now
లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు!

లక్కవరపుకోట, సూర్య : శృంగవరపుకోట నియోజకవర్గం, లక్కవరపుకోట మండలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ బోర్‌వెల్ పనులు కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయి, కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చందులూరు పంచాయతీతో పాటు రొంగలివానిపాలెం గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) పనుల ఆధ్వర్యంలో బోర్‌వెల్ పనులు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటువంటి పనులు చేపట్టడం నిబంధనలకు అనుగుణమేనా? గతంలో మంజూరైన పనుల పేరుతో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత మంజూరుల పేరుతో పనులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రభుత్వ ఉద్యోగులు సైతం తప్పనిసరిగా పాటించాల్సి ఉండగా, ఈ పనుల విషయంలో స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయంపై లక్కవరపుకోట ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను వివరణ కోరగా, చందులూరు గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న బోర్‌వెల్ పనులతో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ పనులకు సంబంధించి తమ శాఖ ఎలాంటి బిల్లులనూ రికార్డు చేయలేదని, భవిష్యత్తులో కూడా బిల్లులు రికార్డు చేయబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే, ఆయా పనులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? వాటికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారుల అనుమతి ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత ఎన్నికల అధికారులు స్పందించి, పనులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట,  విజయనగరం జిల్లా.