ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
నాగారం,మేజర్ న్యూస్:
మండల పరిధిలో సూర్యాపేట జనగాం ప్రధాన రహదారి వెంట ప్రమాదం జరుగు స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు డి.ఎస్.పి ప్రసన్నకుమార్ తెలిపారు. శుక్రవారం నాగారం క్రాస్ రోడ్లో హెచ్చరిక బోర్డులను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో హెచ్చరిక బోర్డులను గమనించి జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.ఆయన వెంట సిఐ నాగేశ్వరరావు ఎస్సైలు చిరంజీవి మధు జాతీయ రహదారి ప్రోగ్రాం ఆఫీసర్ రామ్ కుమార్ తదితరులు ఉన్నారు.