ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ గుంటూరుజి జి హెచ్ లో మృతి చెందాడు. ఉల్లగల్లు సమీపంలో మోటార్ సైకిల్ ను ఆటో ఢీకొంది. ఈ సంఘటనలో తాళ్లూరుకు చెందిన ఎల్లమందకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరులో జిజెహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై కోటేశ్వరావు తెలిపారు.
ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి కేసును దర్యాప్తు చేసి శవ పంచనామ నిర్వహించి అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.