BREAKING
కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలి --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ బొంపల్లి బిడ్డకు పోలీస్‌ శిక్షణలో గుర్తింపు క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం* అమ్మవారి పీఠాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని మొదటి రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రీ-సర్వేతో రైతులకు భరోసా:బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం ఉక్రెయిన్ సరిహద్దులో నాన్-నెగోషియేబుల్ భద్రతా మండలి నిర్మాణం *బతుకమ్మ మెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే* మైల్వార్‌లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి *నాట్య మయూరి సినీత విజయకి ఘన సత్కారం* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆసుపత్రి నుంచి పుతిన్‌తో పోప్ సిఫ్రియన్ ఫోన్ కాల్ *భవాని మాత, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే* ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం:2 తులాల బంగారం, నగదు అపహరణ

వైభవంగా వాగ్దేవి సరస్వతి దేవి పూజలు

Select Suryaa Now
వైభవంగా వాగ్దేవి సరస్వతి దేవి పూజలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం  అనపర్తి మండలం పొలమూరు గ్రామంలోవిద్యాప్రదాయిని, వాగ్దేవి అయిన శ్రీ సరస్వతీ దేవి పూజా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు, విద్యాభ్యాసం పట్ల ఆసక్తిని ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

తొలుత మధ్యాహ్నం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం వద్ద నెలకొల్పిన శ్రీ శారదాంబ అమ్మవారి ఆవరణలో వేదోక్త సంప్రదాయానుసారం పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించి, అమ్మవారి కృపాకటాక్షాలు సిద్ధించాలని ప్రార్థించారు. విద్యాబుద్ధులు, జ్ఞానవిజ్ఞానాలు, సద్బుద్ధి, సత్ప్రవర్తనతో చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం సాయంత్రం శ్రీదేవి సెంటర్‌లో పండితుల ఆధ్వర్యంలో సరస్వతీ దేవి పూజలను భక్తిప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాగ్దేవిని ఆరాధించారు. పూజా ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తిమయ వాతావరణం నెలకొంది.పూజా కార్యక్రమాల అనంతరం చిన్నారులకు విద్యాభ్యాసానికి ఉపయుక్తమైన పెన్నులు, ప్యాడ్లు, పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, సరస్వతీ దేవి చిత్రపటాలతో పాటు ఇతర విద్యా సామగ్రిని దాతలు, పూజా కార్యక్రమాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు అందజేశారు. విద్యార్థుల్లో చదువుపట్ల మక్కువను పెంపొందించి, విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే సదుద్దేశంతో ఈ సామగ్రిని పంపిణీ చేశారు.విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా నిలిచే సరస్వతీ దేవిని ఆరాధిస్తూ చిన్నారులతో పూజలు నిర్వహించడం, వారికి విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాలబాలికల్లో భక్తిభావంతో పాటు క్రమశిక్షణ, విద్యాసక్తి, నైతిక విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు, దాతలు, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.