BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం:2 తులాల బంగారం, నగదు అపహరణ

Select Suryaa Now
ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం:2 తులాల బంగారం, నగదు అపహరణ

​బషీరాబాద్, మేజర్ న్యూస్: ​ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన బషీరాబాద్ మండలంలోని బాద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
​బాధితురాలు మరియు పోలీసుల కథనం ప్రకారం... బాద్లాపూర్ గ్రామానికి చెందిన కంసనపల్లి కవిత (భర్త మైసప్ప) గురువారం (తేదీ: 15.10.2026) ఉదయం 11:00 గంటలకు తన ఇంటికి తాళం వేసి రోజువారీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన ద్వారం తాళంతో పాటు బీరువా తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.​బీరువాను పరిశీలించగా అందులో భద్రపరిచిన 2 తులాల బంగారు గుండ్లు, కమ్మలు, ముక్కుపుడకతో పాటు కొంత నగదు మాయమైనట్లు గుర్తించారు. బాధితురాలు కవిత వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.