అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కోటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని బొప్పుడు వారి పాలెం ఈదర కొమ్మవరం భీమవరం గ్రామాల్లోని పోలింగ్ బూత్ లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రశాంతంగా సాగేందుకు ప్రజల సహకరించాలని కోరారు. అనవసరంగా గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే సమాచారం అందించాలని ప్రజలను ఎస్సై కోరారు