BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

*తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్*

Select Suryaa Now
*తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు*  *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్*

తూప్రాన్;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాధాకుమారి శ్రీనివాస్, ప్రియాంక, జ్యోష్ణ వేణు, సరిత నాగేష్, సత్య లింగం, చెలిమెల రాములు, ఐలేష్ యాదవ్‌లతో పాటు మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబురాలను సందడిగా నిర్వహించారు.