*శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు*
కోహెడ;కోహెడ మండలంలోని కూరెళ్ళ గ్రామ పంచాయతీ దగ్గర శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి సుందర అలంకరణలో భాగంగా ఈరోజు ఉదయం పూజ అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు మరియు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ భవాని దీక్ష పరులు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.