BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

*గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు*

Select Suryaa Now
*గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం*  *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు*

కోహెడ;కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను  ఘనంగా ప్రారంభించారు.ఈ పోటీల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి స్థానిక సర్పంచ్ బందెల సుజాత మరియు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ని కోహెడలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి హాజరైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్, జూదం ,ఆన్లైన్ గేమ్స్ కి బానిస కాకూడదని ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొని శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పోటీలలో గెలుపోటములు సహజమని గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. గత 12 సంవత్సరాలుగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టు (విన్నర్) 10 వేల నగదు తో పాటు ట్రోఫీని రెండవ జట్టు (రన్నర్) 5 వేల నగదు తో పాటు ట్రోఫీని అందజేస్తామని తెలిపారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెస్ట్ ప్లేయర్ అవార్డు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్, కోహెడ గ్రామ ఉపసర్పంచ్ కందాల వెంకటేష్, సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, డాక్టర్ సీహెచ్ దయాకర్, వార్డు సభ్యులు గుగ్గిళ్ళ శ్రీనివాస్,కందాల రవీందర్,గజ్జెల ప్రవీణ్, సదానందం,ఆర్గనైజర్స్ రఘు యాదవ్,అవినాష్, వంశీ,అంజి,మనీ,గవ్వ వంశీధర్ రెడ్డి యువసేన సభ్యులు పూసాల రాజశేఖర్,రామంచ అరుణ్ రెడ్డి, కలికోట రాహుల్ చారి, శెట్టి శ్రీనివాస్,వట్టిపెల్లి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.