దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
చౌటుప్పల్,మేజర్ న్యూస్: పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆవుల యేసు యాదవ్–పుణ్యవతి దంపతులు, చౌటుప్పల్ శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం ఉపాధ్యక్షుడు నల్ల పద్మయ్య యాదవ్–కృష్ణవేణి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజు యాదవ్, ధనలక్ష్మి, తేజస్వి, శ్రీనిత్య, యశ్వంత్, ప్రీతి, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ల మురళి గురుస్వామి, ధర్మకర్త వర్కాల రవి గౌడ్, బొబ్బిళ్ల సామ్రాట్ హాజరయ్యారు. వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ, రోహిత్ మిశ్రా వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.