మంత్రి ఆనం సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న బసవరాజుపాలెం వైసీపీ కుటుంబాలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు రూరల్ మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామానికి చెందిన 35 కుటుంబాలవారు ఆ పార్టీకి వీడ్కోలు పలికి శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు . రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో, రూరల్ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు రమణమ్మ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గ్రామంలోని బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబాలు కూటమి ప్రభుత్వ సంక్షేమం మరియు ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఆనం వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, బసవరాజుపాలెం గ్రామాభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.