నిరుద్యోగులకు వరం ఐక్యత జాబ్ మేళాలు
అమనగల్లు, రంగారెడ్డి:
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు వారి పాలిట వరంగా మారాయని ఫౌండేషన్ సభ్యులు ఉద్యోగాలు సాధించినయువకులుచెప్పారు.యువత కష్టపడి చదివి నైపుణ్యాలనుపెంపొందించుకోవడంతోపాటు,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ లు, ఉచిత శిక్షణ కేంద్రాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలునిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈనెల 13న ఆమనగల్లు ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్ లో మొదటి రౌండు సెలక్షన్స్ లో నియోజకవర్గం నుండి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో 25 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారిని ఫౌండేషన్ సభ్యులు అభినందించి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవలు అందిస్తూ ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించిందని వివరించారు.నియోజకవర్గంలోని యువత ఫౌండేషన్ అందిస్తున్న నైపుణ్యాలను, శిక్షణ తరగతులను, జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని వారు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి భవిష్యత్తునుతీర్చిదిద్దేందుకు జాబ్ డ్రైవ్ లు నిరంతరంకొనసాగుతాయని తెలిపారు.యువతకు ఉద్యోగం కుటుంబానికి భరోసా,సమాజానికి అభివృద్ధి అనే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పౌండేషన్ సభ్యుడుచంద్రశేఖర్,నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.