ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు.....
#.రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మీ విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం...... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని నల్లగొండ జిల్లాలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు “ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థుల వ్యాస రచనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు.
పోలీస్ ఫ్లాగ్ డే/ పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్న వారోత్సవాలలో భాగంగా “అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే” అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2025 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటి వరకు తీసిన 3-ఫోటోలు, తక్కువ నిడివి (3-నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ ఈ పోటీల నామినేషన్లకు పంపించాల్సి వుంటుందని తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థులు పాల్గొనవచ్చుఅని అన్నారు.