అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక
భీమవరం, సూర్య న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలు, దసరా పండుగ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు భీమవరం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్తో పాటు ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో భీమవరం ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.అలాగే గతంలో అక్రమ మద్యం కేసుల్లో (ఎన్డీపీఎల్) నిందితులుగా ఉన్న వ్యక్తులకు భీమవరం ఎక్సైజ్ స్టేషన్ సీఐ జి. బసంతి కౌన్సెలింగ్ నిర్వహించి, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా సీఐ జి. బసంతి మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా మద్యం వ్యాపారం నిర్వహించినా, మద్యం రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు, పండుగల సమయంలో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా,