జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి;సంగారెడ్డి జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.