ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి
- పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ : నవంబర్ 3న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు కోరారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పామూరు పట్టణంలోని శేషమహల్ ప్రాంగణంలో పువ్వాడి వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని ఐదు ఎంపీటీసీ ప్రాదేశికాల అభ్యర్థుల ఖరారు కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నాయకుల అభ్యర్థుల వివరాలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు. పోటీ చేస్తామని చెప్పిన వారి వివరాల జాబితాను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి పంపనున్నట్లు పువ్వాడి వెంకటేశ్వర్లు తెలిపారు. నవంబర్ 3న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి,బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, యాదాల వెంకట సాయి కిరణ్, బైరెడ్డి జయరామిరెడ్డి, యారవ ప్రసాద్ రెడ్డి, కొండిశెట్టి రమణయ్య, షేక్ గౌస్ బాషా, సయ్యద్ అమీర్ బాబు, యిర్రి కోటిరెడ్డి, నొస్సం నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.