కౌన్సిలర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
సదాశివపేట;తుల్జా భవాని యూత్ అధ్యక్షులు, కౌన్సిలర్ శంకర్ గౌడ్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకాలంలో వర్షాలు కురిచే పాడిపంటలతో సస్యశ్యామల ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కౌన్సిలర్లు, మండల నాయకులు, తుల్జా భవాని యూత్ సభ్యులు రవీందర్ రెడ్డి, ఫణి కృష్ణ, మహేష్, నిఖిల్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.